1, జనవరి 2020, బుధవారం

2019 ముఖ్య అంశాలు

2019 సంవత్సరం లోని ముఖ్య అంశాలు - జనరల్ నాలెడ్జి

1.తలాక్ చట్టం: 2019 జూలై లో భారత ప్రభుత్వము తలాక్ చట్టాన్ని ప్రవేశపెట్టింది.ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా,మాటల ద్వారా, రాత పూర్వకంగా లేదా మరి ఏ విధంగానైన తలాక్ చెప్పినా మూడు (3) సం.లు జైలు శిక్ష విధిస్తారు. ఆ ఎదుటి వ్యక్తీ (బాదిత మహిళ ) వాదన విన్నాక తలాక్ చెప్పిన వ్యక్తిని బెయిల్ పైన విడుదల చెయాలా వద్దా అన్న అంశం పై పూర్తి న్యాయమూర్తి కి పూర్తి  అధికారం వుంటుంది.

2. 370 వ ఆర్టికల్ రద్దు: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యొక హోదా కల్పించిన 370 వ ఆర్టికల్ ను ఆగస్టు 2019  లో రద్దు చేసింది.పార్లమెంట్ చేసే చట్టాలన్నీ ఈ రాష్ట్రానికి వర్తిస్తాయి.జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది.జమ్మూ కాశ్మీర్ శాసన సభ కలిగిన రాష్ట్రము గా (అసెంబ్లీ ) మరియు లడ్డాక్ శాసనసభ  లేని రాష్ట్రము గా వుంటుంది. దేశంలో ఎక్కడివారైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు.

3.పౌరసత్వ బిల్లు: పౌరసత్వ సవరణ బిల్లును భారత ప్రభుత్వం డిసెంబర్ లో తీసుకొని వచ్చింది.ఆఫ్గానిస్త్తాన్,బంగ్లాదేశ్,పాకిస్తాన్ లలో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వలన వేరు వేరు మార్గాలలో 2014 కు ముందు వలస వచ్చిన హిందూ,సిక్కు ,జైన,పార్శీ,బౌద్ద,క్రైస్తవుల కోసం భారతీయ పౌరసత్వము సవరణ చట్టం తీసుకొని వచ్చారు.జాతీయ పౌర పట్టిక రూపోమ్దిన్చాలన్ననిర్ణయం నేపధ్యంలో ఈ పౌరసత్వ చట్టానికి ప్రాధాన్యత ఏర్పడింది.

4. అయోధ్య రామ మందిరం తీర్పు: రామ జన్మ భూమి,బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే.అయితే 2019 నవంబర్ లో సుప్రీంకోర్ట్ తీర్పులో రాం లల్లా కే ఈ 2.77 ఎకరాల భూమి చెందుతుందని తీర్పు చెప్పింది.కేంద్ర ప్రభుత్వం 3 నెలలలోగా ట్రస్ట్ప్రా ను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ భాధ్యతను ట్రస్ట్ర్ కే అప్పగించాలని సూచించింది. 

5. సహ చట్టం లోకే సుప్రీం కోర్టు: భారత ప్రభుత్వ న్యాయమూర్తి ప్రధాన కార్యాలయం ప్ర్జాదికార సంస్థ అని , దీనికి కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని (సహ చట్టం ) సుప్రీం కోర్టు తన తీర్పు లో ప్రకటించింది.
6. రాఫెల్ తీర్పు : రాఫెల్ ఒప్పందం పై దర్యాప్తునకు నిరాకరిస్తూ దాఖలైన పిటీషన్ ను 2019 నవంబెర్ లో కొట్టివేసింది. ఇది ఒక సంచలానాత్మక తీర్పు అని చెప్పవచ్చు.భారత ప్రభుత్వానికి ఫ్రెంచు కంపెని దసో యావిఏషణ్ కు మధ్య యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి అవినితీ చోటు చేసుకోన్నదని వచ్చిన కేసు ఇది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి