12, జనవరి 2020, ఆదివారం

రైతు పండుగ సంక్రాంతి -జనవరి 13 నుండి 4 రోజుల పాటు జరుపుకోనున్న తెలుగు ప్రజలు

రైతు పండుగ సంక్రాంతి -జనవరి 13 నుండి 4 రోజుల పాటు జరుపుకోనున్న తెలుగు ప్రజలు
రైతుల పండుగ అంటే సంక్రాంతి అని అంటారు. ఎందుకనగా రైతులు తమ కష్టాన్ని చెమట రూపంలో కార్చి 100 రోజుల పాటు చెమటోడ్చి పండించిన కొత్త పంట ఇంటికి తీసుకునివరడం  చాలా సంతోషం. సంక్రాంతి పండుగ సూర్యుడు మేషాది ద్వాదశ రాషులయందు పూర్వరాశి నుండి ఉత్తరరాశి లోకి ప్రవేశించినపుడు సంక్రాంతి మొదలు అవుంతుంది. ఈ పండగ రోజు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలలో చెప్పబడి వుంది. ఈ పండుగ రోజు ఉదయంనే మహిళలు తల స్నానం చేసి ఇంటి ముందు పెద్ద ముగ్గులు , రంగులతో అలంకారములు చేసి గొబ్బెమ్మలను పెట్టి ఆ రోజు దాసులకు బియ్యం, మంగలి వారికి బియ్యం లేదా తోచినంత నగదు ఇవ్వడం వలన ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతాము . అలాగే పురుషులు ఇంటి బయట తోరణాలను అలంకరించడం మొదలైనవి చేస్తారు. ఆరోజు పూజలు తమకు ఇష్టమైన దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు . సంక్రాంతి ముందు రోజు భోగి మంటలతో సంతోషం గా గడుపుతారు. ఆ రోజు చిన్న పిల్లలకు రేగి పళ్ళతో చిన్న పేరంటం లాంటి కార్యక్రమాన్ని చేస్తారు. సంక్రాంతి రోజు కోడి పందాలు, ఎద్దు పందాలు మనం పల్లెలలో చూడవచ్చు.పండుగ రోజు బక్షాలు, చిత్రాన్నం, పులిహోర, మిరపకాయ బజ్జీ, బొండాలు మొదలైనవి వండుకొని ఆ రోజు సంతోషంగా గడుపుతారు. మరుసటి రోజు కనుమ , ముక్కనుమ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ అందరు సంతోషం గా గడపాలని మనస్పూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...