26, ఏప్రిల్ 2020, ఆదివారం

జూన్ 12 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

జూన్ 12 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం:
జూన్ 12 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎండాకాలం తీవ్రత వుండడం,మరియు కరోనా మహమ్మారి వుండడం వలన ఈ ప్రకటనను పత్రికలద్వారా, మీడియా ద్వార తెలపడం జరిగినది.కాబట్టి విద్యార్థులు గమనించాలని కోరుచున్నారు.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఉచితంగా సరుకులు,ఆహరం పంపిణి

కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఉచితంగా సరుకులు,ఆహరం పంపిణి:
కరోనా మహమ్మారి లో భాగంగా ఎంతో మంది నిరుపేదలు పట్టెడు అన్నం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ద్రుష్టి లో వుంచుకొని తెలంగాలోని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్  మునిసిపల్ కార్పోరేషన్ వారు ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లకు లేదా ఆప్ ద్వార ఫోన్ చేసి ఎవరైనా ఉచితంగా సరుకులు,భోజనాలు , తదితర వస్తువులు ఇవ్వదలచుకున్నవారు 040-21111111 ,9154686557/58 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం అందించవచ్చు అని తెలిపారు.లేదా http://covid123.in అప్లికేషను ఓపెన్ చేసి మీ సహాయాన్ని ఇవ్వవచ్చు.

ఉచితంగా శానిటైజర్ లను అందించిన సికింద్రాబాద్ లోని ఆటో మొబైల్ షాప్ అధినేత


ఉచితంగా శానిటైజర్ లను అందించిన సికింద్రాబాద్ లోని ఆటో మొబైల్ షాప్ అధినేత :
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో కొతమంది సేవలను అందిస్తున్నారు.ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లో వున్న ఒక ఆటో మొబైల్ షాప్ అధినేత ఒకరు మాస్కులు , శానిటైజర్లు కమీషనర్ ఆఫీస్ లో ఉచితంగా అందచేశారు. వీటి విలువ షుమారు 10 లక్షల విలువ వుంటుంది.

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ మరణం

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ మరణం:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ గత కొంతకాలంగా  కాన్సర్ వ్యాదితో బాధ పడుతూ శనివారం నాడు మరణించారని ఐ.సి.సి. ప్రకటించింది. ఆయన మొదట దక్షిణాఫ్రికా లో తానెంతో నిరుపించుకున్నారు.బౌలింగ్ వీరుడు అని పేరు కూడా ఈయనకు వుంది.ఈయన 1971-75 మధ్యకాలంలో ఎన్నో షీల్డ్స్ కూడా గెలుపొందడం జరిగినది.

కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా కొటారి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో స్వీకారం

కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా కొటారి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో స్వీకారం:
కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన ఇంతక మునుపు  రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు.

కోవిడ్ 19 లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న భారత ప్రధాని

కోవిడ్ 19 లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న భారత ప్రధాని:
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కోవిడ్ 19 లో భాగంగా రాష్ట్రాల పరిస్తితులను తెలుసుకోవడానికి సోమవారం అంటే ఏప్రిల్ 27 వ తేదిన తమ చాంబర్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార చర్చించనున్నారు. అదే విధంగా అయన కోవిడ్ కు సంబంధించి ఆరోగ్య సేతు  అనే అప్లికేషను కూడా విడుదల చేయడం జరిగినది. ఈ అప్లికేషను చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటున్నారు.

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు ఎంపిక

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు ఎంపిక:
ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు,హైదరాబాద్,తెలంగాణా కు చెందిన పి.వి.సిందు ను ఎంపిక చేయడం జరిగింది.ఐ యాం బాడ్మింటన్ అంబాసిడర్ గా పేర్కొన్నారు.నిజాయితీగా ఆడడం,ఆట పట్ల , ప్రేమ ,గౌరవం వుండాలని కోరుకున్నారు.ఈ ప్రచార కార్యకర్తగా నన్ను ఎంపిక చేసినందుకు నేను ఈ ప్రచారములో భాగంగ ఈ ఆటను ఇంకా ప్రజలలోకి తీసుకుని వెళ్లి ప్రోత్సహించడానికి వీలవుతుంది అని తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు 66 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేసిన కృష్ణ బోర్డ్

రెండు తెలుగు రాష్ట్రాలకు 66 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేసిన కృష్ణ బోర్డ్:
రెండు రాష్ట్రాలకు కృష్ణ బోర్డు విడుదల చేసే నీటిని మే నెల చివరి వరకు వాడుకోవాలని సూచించింది.ఆంధ్ర ప్రదేశ్ కు కేవలం 14 టి.ఎం.సి,లు  , అదే విధంగా తెలంగాణాకు 52 టి.ఎం.సి.ల నీటిని  కేటాయించినది.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో వున్న నీటి లభ్యతను బట్టి ఈ కేటాయింపులు జరుగుతాయి.ఇందులో ఒక (1)టి.ఎం.సి. నీటిని ఆంధ్ర ప్రదేశ్ లోని హంద్రి కి కేటాయించడం జరిగినది.అదే విధంగా తెలంగాణా లోని కల్వకుర్తి కి 2 టి.ఎం.సి.నీటిని కేటాయించడం జరిగినది అని కృష్ణ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

22, ఏప్రిల్ 2020, బుధవారం

కువైట్ లో క్షమాబిక్ష కోసం 6000 మంది పైగా దరఖాస్తులు

కువైట్ లో క్షమాబిక్ష కోసం 6000 మంది పైగా దరఖాస్తులు:
కువైట్ లో 3 వేలకు పైగా తెలుగువారు మరియు ఇతర దేశస్తులకు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) కు పాస్ పోర్ట్ కలిగివుండి స్థానికంగా నివాసానికి అనుమతి లేని వారు భారత దేశానికి వచ్చేందుకు 6 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలకు చెందిన  దాదాపు 3 వేల మంది ఇందులో వున్నారు. కరోన మహమ్మారి వుండడం వలన ఏప్రిల్ వరకు గడువును ఇచ్చింది. కొంతమంది తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు,పాస్ పోర్ట్ గడువు తీరిపోయిన వారు ఇందులో వున్నారు. 

ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన తెలంగాణ

ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన తెలంగాణ:
ఎం.సెట్,జే.ఈ.ఈ.మొదలైన పరీక్షలకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్న ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల విధ్యార్థులు హాజర్ కావచ్చును. విద్యార్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చును.
లింక్:tscie.rankr.io. 

kurnool medical college jobs-last date--కర్నూల్ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలు-7

kurnool medical college jobs-last date
కర్నూల్ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలు-7
కర్నూల్ మెడికల్ కాలేజ్ లో రీసర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 
చివరితేది:---
అప్లికేషను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
లింక్:
http://kurnoolmedicalcollege.in/img/pdf/job-notification.pdf

చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్

చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్:
పొరుగు దేశం అయిన చైనా తన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను టిబెబ్ లో భాగంగా చూపించింది. భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ శ చైనా సరిహద్దులు మారిన విషయాన్ని స్కై మ్యాప్ వినియోగదారులు గుర్తించారు. టిబెట్ ను ఆక్రమించిన చైనా అరుణాచల్ ప్రదేశ్ ఇందులో భాగమని వాదిస్తుంది.

యూ.ఎస్.ఏ. సైన్స్ బోర్డు సభ్యుడిగా ప్రవాస భారతీయుడు

యూ.ఎస్.ఏ. సైన్స్ బోర్డు సభ్యుడిగా ప్రవాస భారతీయుడు:
భారతీయ సంతతికి చెందిన సుదర్శనం బాబు అనే శాస్త్రజ్ఞుడుని సభ్యుడిగా తీసుకుతున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

విచిత్రం-శానిటైజర్ తో సారా తయారి

విచిత్రం-శానిటైజర్ తో సారా తయారి:
లాక్ డౌన్ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక మెడికల్ రేప్రేజేంట్ మరో ముగ్గురితో కలిసి శానిటైజర్ తో సారాయి తయారు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అబ్కారి కమీషనర్ పోలీసులను పంపి అరెస్ట్ చేశారు.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ డాక్టర్లు కోసం ప్రకటన

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ డాక్టర్లు కోసం ప్రకటన:
కోవిడ్ 19 లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనరల్ డ్యూటీ మెడికల్ డాక్టర్ ల సంఖ్యను 1170 కు పెంచింది.అప్లై చేసుకోవడానికి చివరితేదిని ఈ నెల 23 వరకు పెంచింది.

TODAY IS CIVIL SERVICES DAY - PM NARENDRA MODI SPEECHES ON THIS ARTICLE AND TWEET IN TWITTER

TODAY IS CIVIL SERVICES DAY - PM NARENDRA MODI SPEECHES ON THIS ARTICLE AND TWEET IN TWITTER:

సివిల్ సర్వీసెస్ డే సందర్బముగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సివిల్ సర్వెంట్స్ మరియు వారి కుటుంబ సభ్యులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ 19 లో భాగంగా కలెక్టర్ 24 గంటల పాటు సేవ చేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా సర్దార్ వల్లబాయి పటేల్ గారికి అయన ఘన నివాళులు అర్పించారు.

పశువులకు,జంతువులకు ఆహరం దొరకక అవస్థలు

పశువులకు,జంతువులకు ఆహరం దొరకక అవస్థలు:
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతము కరోనా విరుచుకుపడుతుంది. అయితే మనుషులకు ప్రత్యక్షంగా రోజు వారి కూలీలకు అన్నం దొరకక కూలి పనులు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ప్రపంచంలో చాలా చోట్ల జీవాలకు ఆహరం దొరకడం కష్టతరమైంది.కాబట్టి తమకు తోచిన మీ ఇంట్లో వున్న కొంత ఆహారాన్ని , అలాగే పశువులకు దానా వంటివి ఇస్తే వాటిని కాపాడుకున్న వాళ్ళము అవుతాము.

2021 ఒలింపిక్స్ వివరాలు

2021 ఒలింపిక్స్ వివరాలు:
కరోనా కారణంగా ఈ సం.లో జరగవలసిన టోక్యో ఒలింపిక్స్2021 కి వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుత కరోనా ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే సం.ము కూడా జరుగుతాయా అని అనుమానంగా వుంది. ఎందుకంటే ఈ ఒలింపిక్స్లో ప్రపంచం లోని చాలా దేశాలు పాల్గొంటాయి. కరోనా ఎప్పటికి సమసిపోతుందో తెలియని పరిస్థితి. అందుకోసమే ఎప్పుడనేది స్పష్టంగా తెలియలిసివుంది.

కరోన నుంచి కోరుకున్న ముగ్గురు బాధితులు

కరోన నుంచి కోరుకున్న ముగ్గురు బాధితులు:
కర్నూల్ జిల్లా బనగానపల్లి,అవుక్,కర్నూల్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోన వుందని వారిని నంద్యాలలోని శాంతిరాం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేశారు. అయితే రెండు సార్లు వీరిని పరీక్షించిన తర్వాత వారికి ఎటువంటి కరోన లక్షణాలు లేవని నిర్దారించుకున్న తర్వాతనే  వీరి ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

పాలిటెక్నిక్ దరఖాస్తు గడువుపెంచిన ప్రభుత్వం

పాలిటెక్నిక్ దరఖాస్తు గడువుపెంచిన ప్రభుత్వం:
పాలిటెక్నిక్ కళాశాల లో ప్రవేశానికి  నిర్వహించే ఆన్లైన్ దరఖాస్తు తేదీని మే 15 వరకు పొడిగించారు.

ప్రపంచము లోనే అతిపెద్ద ఉచిత అన్నదాన పథకం మాదే అని ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్

ప్రపంచము లోనే అతిపెద్ద ఉచిత అన్నదాన పథకం మాదే అని ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్:
లాక్ డౌన్ సమయంలో నిరుపేదలతో పాటు కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి సహకరిస్తూ వారి కష్టాలను ,కన్నీళ్లను అర్థం చేసుకొని అదే విధంగా పలు సేవలు అందిస్తున్న  పలు విభాగాల సిబ్బందికి దాదాపు 3 కోట్లకు పైగా భోజనాలు అందించారు.అదే విధంగా ముకేష్ అంబానీ పి.ఎం.కేర్స్,మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ పథకాలకు దాదాపు 535 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఆన్లైన్ లో 700 కు పైగా ఉచిత కోర్సులు

ఆన్లైన్ లో 700 కు పైగా ఉచిత కోర్సులు:
లాక్ డౌన్ సందర్భంగా మీకు వున్న సమయాన్ని ఉచిత కోర్సులకు ఒక అప్లికేషను ఉచితంగా అందిస్తుంది. యుడేమి 700 అనే అప్లికేషను డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మోనిటరింగ్ కమీషన్ వారి ప్రకటన విడుదల

ఆంధ్ర ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మోనిటరింగ్ కమీషన్ వారి ప్రకటన విడుదల:
ఆంధ్ర ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మోనిటరింగ్ కమీషన్ వారు బి.టెక్,బి.ఫార్మసి,డి.ఫార్మసి,పి.బి.ఫార్మా,బి.ఆర్క్,ఎం.టెక్,ఎం.ఆర్క్,ఎం.ప్లానింగ్,ఎం.ఫార్మసి,ఎం.బి.ఏ.,ఎం.సి.ఏ.బి.ఇ.డి.,ఎం.ఈ.డి.,లాంగ్వేజ్ పండిట్ తెలుగు,హిందీ,ఉర్దూ మొదలైన కోర్సులకు ప్రకటన విడుదల చేసింది. చివరితేది:20-05-2020
లింక్:http://aphermc.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

రంజాన్ వేడుకలు ఇళ్లలోనే చేసుకోండి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన

రంజాన్ వేడుకలు ఇళ్లలోనే చేసుకోండి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన:
రంజాన్ మాసం దగ్గర పడడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తతో ముస్లిం సోదర,సోదరీమణులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ పండుగ ముస్లిం చాలా పెద్దపండుగ. కాని లాక్ డౌన్ ను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులకు మరియు ముస్లిం మత పెద్దలకు ఈ సూచన చేసింది. కాబట్టి ముస్లిం సోదరులు,పెద్దలు సహకరించి ఈ పండుగ ను సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10700 వార్డ్ మరియు గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10700 వార్డ్ మరియు గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
కోవిడ్ 19 సందర్భంగా చాలామంది వాలంటీర్లు తమ పోస్ట్లకు రిజైన్ చేయడం,అటెండెన్స్ సరిగా లేకపోవడం తదితర కారణాల వలన ఖాళీ అయిన పోస్ట్ లకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది.
కనీస అర్హత: ఇంటర్మీడియట్ పాస్ లేదా డిగ్రీ పాస్ అయితే చాలు
అయితే గిరిజన ప్రాంతాలకు చెందినవారు 10 వ తరగతి పాస్ అయితే చాలు అని పేర్కొంది. 
చివరితేది:  ఏప్రిల్ 25 గా నిర్ణయించింది.కాబట్టి ఎవరైనా ఇంటరెస్ట్ వున్నవారు నెట్ సెంటర్ కు తమ సర్టిఫికెట్లను తీసుకుని వెళ్లి అప్లై చేసుకోగలరు.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

కర్నూల్ జిల్లా లో కోవిడ్ 19 హాస్పిటల్ల్స్ లో ఉద్యోగాలు చివరితేది:25-04-2020

కర్నూల్ జిల్లా లో కోవిడ్ 19 హాస్పిటల్ల్స్ లో ఉద్యోగాలు చివరితేది:25-04-2020:
కర్నూల్ జిల్లా లో కోవిడ్ 19 లో భాగంగా ప్రభుత్వం అనేస్తీసియా మరియు స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లికేషనులు కోరుచున్నవి. అప్లై చేసుకునే వారికీ కనీస వయసు 18-42 సం.ల వరకు కలిగి ఉండవచ్చును. వికలాంగులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. డిప్లమా ఇన్ అనెస్తీషియా,స్టాఫ్ నర్స్ లకు బి.ఎస్.సి.నర్సింగ్, మరియు మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ తప్పనిసరి కలిగివుండవలెను.
క్రింది లింక్ ద్వార వివరాలను తెలుసుకోవచ్చును.
https://cdn.s3waas.gov.in/s37f24d240521d99071c93af3917215ef7/uploads/2020/04/2020041941.pdf

బి.ఎస్.ఎన్.ఎల్.తమ వినియోగదారులకు ఉచిత కాలపరిమితి మే 5 వరకు పొడిగింపు

బి.ఎస్.ఎన్.ఎల్.తమ వినియోగదారులకు ఉచిత కాలపరిమితి మే 5 వరకు పొడిగింపు:
బి.ఎస్.ఎన్.ఎల్.తమ వినియోగదారులకు ఉచిత కాలపరిమితి మే 5 వరకు పొడిగించింది. లాక్ డౌన్ ను దృష్టిలో బి.ఎస్.ఎన్.ఎల్. తమ వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పించింది.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కోవిడ్ 19 నియంత్రణ కు వాలంటీర్లు కావలెను

కోవిడ్ 19 నియంత్రణ కు వాలంటీర్లు కావలెను
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చేయడానికి వాలంటీర్లు గా నియమించుకోవడానికి రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్,పారమిలిటరి
పోలీసు,ఎక్సైజ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని ,వీరు రోగులకు సేవలు అందించడానికి సిద్దంగా వుండాలని అప్లై చేసుకోదలచిన వారు ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
www.transporttelangana.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

INDIAN RAILWAY WILL BE REFUND FULL AMOUNT OF CANCELLATION OF TICKETS NO NEED TO CANCEL AGAIN AUTOMATICALLY THEY WILL CANCEL TICKETS - ఇండియన్ రైల్వే 39 లక్షల టికెట్ల రద్దు చేసిన రైల్వే

INDIAN RAILWAY WILL BE REFUND FULL AMOUNT OF CANCELLATION OF TICKETS NO NEED TO CANCEL AGAIN AUTOMATICALLY THEY WILL CANCEL TICKETS 
  ఇండియన్ రైల్వే 
39  లక్షల టికెట్ల రద్దు చేసిన రైల్వే:
కోవిడ్ 19 లో భాగంగా బారతీయ రైల్వే మే 3 వరకు బుక్ చేసుకున్న టికేట్లన్నింటిని రద్దు చేసింది. ఇందులో భాగంగా రైల్వే బుక్ చేసుకున్న వారి అమౌంట్ ను తిరిగి వారి ఖాతాలలో వేస్తుంది. కస్టమర్ క్యాన్సల్ చేయకుండానే రైల్వే శాఖ మొత్తం టికెట్స్ ను కేన్సిల్ చేస్తుంది. కస్టమర్ ఎవరి కార్డ్ ద్వార అయితే బుక్ చేశారో వారి అకౌంట్ లోకే డబ్బులు జమ చేస్తుంది.

APRJC AND APRDC CET 2020 FOR INTER AND DEGREE - ఏ.పి.ఆర్ జే.సి.,ఏ.పి.ఆర్.డి.సి. నోటిఫికేషన్ చివరితేది:24-04-2020

APRJC AND APRDC CET 2020 FOR INTER AND DEGREE 

ఏ.పి.ఆర్ జే.సి.,ఏ.పి.ఆర్.డి.సి. ఇంటర్,డిగ్రీ ప్రవేశ ప్రకటన
అప్లై చేయడానికి చివరితేది:24-04-2020
దయచేసి ఈ క్రింది లింక్ ను చూడండి.
https://www.youtube.com/watch?v=mTJGQwGqoMk

DOCTOR POSTS IN INDIAN RAILWAYS -ఇండియన్ రైల్వే లో ఉద్యోగాలు చివరితేది:15-04-2020

DOCTOR POSTS IN INDIAN RAILWAYS -


ఇండియన్ రైల్వే లో ఉద్యోగాలు చివరితేది:15-04-2020
దయచేసి ఈ క్రింది లింకు ను ఓపెన్ చేసి చూడండి.
https://www.youtube.com/watch?v=h4JL4S2pjYc