26, ఏప్రిల్ 2020, ఆదివారం

జూన్ 12 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

జూన్ 12 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం:
జూన్ 12 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎండాకాలం తీవ్రత వుండడం,మరియు కరోనా మహమ్మారి వుండడం వలన ఈ ప్రకటనను పత్రికలద్వారా, మీడియా ద్వార తెలపడం జరిగినది.కాబట్టి విద్యార్థులు గమనించాలని కోరుచున్నారు.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఉచితంగా సరుకులు,ఆహరం పంపిణి

కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఉచితంగా సరుకులు,ఆహరం పంపిణి:
కరోనా మహమ్మారి లో భాగంగా ఎంతో మంది నిరుపేదలు పట్టెడు అన్నం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ద్రుష్టి లో వుంచుకొని తెలంగాలోని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్  మునిసిపల్ కార్పోరేషన్ వారు ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లకు లేదా ఆప్ ద్వార ఫోన్ చేసి ఎవరైనా ఉచితంగా సరుకులు,భోజనాలు , తదితర వస్తువులు ఇవ్వదలచుకున్నవారు 040-21111111 ,9154686557/58 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం అందించవచ్చు అని తెలిపారు.లేదా http://covid123.in అప్లికేషను ఓపెన్ చేసి మీ సహాయాన్ని ఇవ్వవచ్చు.

ఉచితంగా శానిటైజర్ లను అందించిన సికింద్రాబాద్ లోని ఆటో మొబైల్ షాప్ అధినేత


ఉచితంగా శానిటైజర్ లను అందించిన సికింద్రాబాద్ లోని ఆటో మొబైల్ షాప్ అధినేత :
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో కొతమంది సేవలను అందిస్తున్నారు.ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లో వున్న ఒక ఆటో మొబైల్ షాప్ అధినేత ఒకరు మాస్కులు , శానిటైజర్లు కమీషనర్ ఆఫీస్ లో ఉచితంగా అందచేశారు. వీటి విలువ షుమారు 10 లక్షల విలువ వుంటుంది.

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ మరణం

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ మరణం:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ గత కొంతకాలంగా  కాన్సర్ వ్యాదితో బాధ పడుతూ శనివారం నాడు మరణించారని ఐ.సి.సి. ప్రకటించింది. ఆయన మొదట దక్షిణాఫ్రికా లో తానెంతో నిరుపించుకున్నారు.బౌలింగ్ వీరుడు అని పేరు కూడా ఈయనకు వుంది.ఈయన 1971-75 మధ్యకాలంలో ఎన్నో షీల్డ్స్ కూడా గెలుపొందడం జరిగినది.

కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా కొటారి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో స్వీకారం

కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా కొటారి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో స్వీకారం:
కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన ఇంతక మునుపు  రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు.

కోవిడ్ 19 లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న భారత ప్రధాని

కోవిడ్ 19 లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న భారత ప్రధాని:
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కోవిడ్ 19 లో భాగంగా రాష్ట్రాల పరిస్తితులను తెలుసుకోవడానికి సోమవారం అంటే ఏప్రిల్ 27 వ తేదిన తమ చాంబర్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార చర్చించనున్నారు. అదే విధంగా అయన కోవిడ్ కు సంబంధించి ఆరోగ్య సేతు  అనే అప్లికేషను కూడా విడుదల చేయడం జరిగినది. ఈ అప్లికేషను చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటున్నారు.

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు ఎంపిక

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు ఎంపిక:
ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య అంబాసిడర్ గా పి.వి.సిందు,హైదరాబాద్,తెలంగాణా కు చెందిన పి.వి.సిందు ను ఎంపిక చేయడం జరిగింది.ఐ యాం బాడ్మింటన్ అంబాసిడర్ గా పేర్కొన్నారు.నిజాయితీగా ఆడడం,ఆట పట్ల , ప్రేమ ,గౌరవం వుండాలని కోరుకున్నారు.ఈ ప్రచార కార్యకర్తగా నన్ను ఎంపిక చేసినందుకు నేను ఈ ప్రచారములో భాగంగ ఈ ఆటను ఇంకా ప్రజలలోకి తీసుకుని వెళ్లి ప్రోత్సహించడానికి వీలవుతుంది అని తెలిపారు.

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...