11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఒకే రోజు ఏ.పి.ఎం.సెట్ మరియు బిట్ శాట్ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు|bonthalaramesh

ఒకే రోజు ఏ.పి.ఎం.సెట్ మరియు బిట్ శాట్ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు-అయితే పరీక్ష సమయం లో మార్పు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన:

కోవిడ్ 19 వల్ల ఎంతోమంది విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఎంతో నష్టం కలిగించింది. ఐతే సుప్రీం కోర్ట్ అనుమతితో పరిక్షలు నిర్వహించుకోవచ్చని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

ఇక విషయం లోనికి వచ్చినట్లయితే మనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిర్వహించ తలపెట్టిన ఏ.పి. ఎం.సెట్ -2020 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు. అయితే బిట్ శాట్ కూడా ఒకే తేదీలలో ఉండడంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని ఆంధ్ర ప్రభుత్వం పరీక్షల సమయాన్ని మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఈ రెండు పరీక్షల తేదీలను చూసినట్లయితే ఈ నెల 17,18 21,25 తేదీలలో ఏ.పి. ఎం.సెట్ నిర్వహిస్తున్నట్లు తెలుసును. బిట్శాట్ పరీక్షలు 16-18,21-29 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ నుండి సుమారుగా 35 వేల మంది దాకా హాజరవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఏ.పి. ఎం. సెట్ హాల్ టికెట్స్ కూడా అవుతున్నాయి. 

ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వారుంటే డౌన్లోడ్ చేసుకోండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి