కరోనా పై ప్రజల నమ్మకం ఏమిటి?ఎందుకింత నిర్లక్షము:
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచం లో ఏ దేశాన్ని కూడా ఈ కరోనా వదలడం లేదు. దీనికి ప్రజలే కారకులు.దీనికి పరిష్కారం ప్రజల చేతులలోనే వుంది. మర్చి 2019 నుండి ఈ వైరస్ ప్రపంచ ప్రజలందరిని వనికిస్తుంది. అయినా ప్రజలలో మార్పు లేదు. ఎవరికి వారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనీసం మాస్క్ లు పెట్టుకోవాలన్న ఇంకిత జ్ఞానమ్ కూడా ఈ ప్రజలకు లేకుండా పోయింది.ఈ కరోనా లో భాగంగా ఎంతో మంది తల్లి తండ్రులను పోగొట్టుకున్నారు. మీడియా ద్వారా అయితేనేమి, వాట్సప్ ద్వారా అయితేనేమి,ఫేస్ బుక్,ఎన్నో మీడియాలలో దీని గురుంచి వార్తలు వస్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా టీవీలు ఎన్నో మాధ్యమాలు ప్రసారం చేస్తున్నా ప్రజలలో ఇంకా మార్పు కనిపించడం లేదు. మరణాల రేటు తక్కువ కూడా లేదు. పెద్ద పెద్ద దేశాల రాజులను, మంత్రులను, అదే విధంగా ఏంతో మంది ప్రజలను ఇది బలి తీసుకోంది. ఇది ఎంతో మంది నిరుపేదలుగా మార్చింది. ప్రజలు వేరు వేరు దేశాలనుండి తమ దేశాలకు , ఇతర ప్రాంతాలలో పని చేస్తున్న వారు తమ ఉపాధి కోల్పోయారు.అయినా ప్రజలలో స్పందన లేదు. ఎవరికి వారు నాకు ఏమి రాదు,నాకు ఏమి కాదు అనే నిర్లక్ష ధోరణి లో వున్నారు. ఇప్పటికి మార్పు లేదు. ఇంకా ఎంత మందిని ఈ మహమ్మారి బలితీసుకున్నా ప్రజలలో మార్పు కనిపించడం లేదు.
గోటితో పోయే దానికి గొడ్డలి తో నరికుకుందం అనే ధోరణి లో ప్రజలు వున్నారు. కొన్ని సం.ల క్రితం ఎన్నో లక్షల ప్రజలు తమ ప్రాణాలను భయంకరమైన వ్యాధితో మరణించారు అని తెలిసిన ఈ ప్రజలలో మార్పు లేదు.
వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ప్రయోగాలు:
నవంబర్ 1 2020 లోగా వ్యాక్సిన్ తీసుకొస్తామని అమెరికా ప్రకటన:
అయితే ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎన్నో దేశాలు మందుల కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూవున్నాయి.ముఖ్యంగా భారత దేశం తన వంతు తాను , అదేవిధంగా భారత దేశ ప్రజలు ఇతర దేశాలతో కలిసి మందులు చేయడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు మందుల కోసం కాకుండా తమను తాము సరైన మందులు,వ్యాయామం,ధ్యానం మొదలైన వాటిని చేస్తూ తమను తాము రక్షించుకోవాలి.
భారతదేశం లో ప్రజలందరికి ఉపయోగ పడేలా ఆరోగ్య సేతు అనే అప్లికేషను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించింది.
కాబట్టి మన ఆరోగ్యం మన చేతులలోనే అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు తమకు తాము మార్పు తెచ్చుకోగలరని కోరుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి